జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మల్యాల మండలం ముత్యంపేటలో కవిత అనే మహిళ తన కుమారుడితో కలిసి బావిలో దూకిన ఘటన కలకలం రేపింది.
స్థానికులు బావిలో మహిళ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అయితే బాలుడు కనిపించకపోవడంతో అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
తల్లి తన కుమారుడితో కలిసి బావిలో దూకినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోడానికి అసలు కారణాలు ఏమిటన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
also read: సికింద్రాబాద్ ఆర్మీ యూనిట్‌లో ఆయుధాల చోరీ కేసు- ముగ్గురు సీనియర్ అధికారులు అదుపులోకి
