Homeక్రైమ్హైదరాబాద్‌లో విషాదం: కూకట్‌పల్లి మెట్రో వద్ద టిప్పర్ ఢీకొని ఇద్దరు మైనర్ల మృతి

హైదరాబాద్‌లో విషాదం: కూకట్‌పల్లి మెట్రో వద్ద టిప్పర్ ఢీకొని ఇద్దరు మైనర్ల మృతి

హైదరాబాద్ నగరంలో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయలుదేరిన ఈ యువకులు, అనుకోని ప్రమాదానికి గురయ్యారు.

సమాచారం ప్రకారం, బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు మైనర్లను వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా, అతడిని తక్షణమే అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

also read: “తల్లికి వందనం” పథకం: మిస్ అయిన వారికి గుడ్ న్యూస్ – మరో అవకాశం, కొత్త జాబితా తేదీలు విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు