Homeఆంధ్ర ప్రదేశ్“తల్లికి వందనం” పథకం: మిస్ అయిన వారికి గుడ్ న్యూస్ – మరో అవకాశం, కొత్త...

“తల్లికి వందనం” పథకం: మిస్ అయిన వారికి గుడ్ న్యూస్ – మరో అవకాశం, కొత్త జాబితా తేదీలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం కింద తొలి విడతలో ఆర్థిక సాయం అందుకోలేని వారికి మరోసారి అవకాశం కల్పించింది. అర్హత ఉన్నప్పటికీ డబ్బులు అందని కుటుంబాలు ఇప్పుడు తమ వివరాలను సరిచేసుకునే వీలు పొందాయి.

గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శిస్తూ, ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేక ప్రక్రియ ప్రారంభించారు. ఆగస్టు 3 వరకు ఈ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

తరువాత, ఆగస్టు 4 నుంచి 10 వరకు వచ్చిన అభ్యంతరాలను అధికారులు సమీక్షించి, అదనంగా అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, కొత్తగా అర్హత పొందిన విద్యార్థుల వివరాలను ప్రకటిస్తారు.

ఇకపోతే, కొత్తగా స్కూల్ లేదా జూనియర్ ఇంటర్‌లో చేరిన విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. వారి వివరాలను సేకరించి, ఆగస్టు 30న తుది జాబితా విడుదల చేసి అదే రోజు ఖాతాల్లో రూ.13,000 జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కొత్త అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. అందువల్ల అర్హత ఉన్న విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఈ గడువులోపు అవసరమైన నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి.

also read: బ్లేడ్ తో భర్త గొంతు కోసి దాడి చేసిన భార్య..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు