Homeఆంధ్ర ప్రదేశ్Breaking: కర్త,కర్మ, క్రియ ఆయనే...త్వరలో జగన్ కు నోటీసులు...!

Breaking: కర్త,కర్మ, క్రియ ఆయనే…త్వరలో జగన్ కు నోటీసులు…!

  • మద్యం కుంభకోణం లో రాజ్ కసిరెడ్డి అరెస్ట్

  • అదుపులో తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

  • త్వరలో జగన్ కు నోటీసులు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ మద్యం కుంభకోణంలో సంచలనం. ఆ కేసులో ప్రధాన సూత్రధారి, వైసిపి హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డిని ఈడి అదుపులోకి తీసుకుంది. గురువారం హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పదికి పైగా కీలక ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది ఈడి. అనంతరం రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసింది.

Also Read: ప్రియుడిపై మోజు…భీమా సొమ్ము కోసం భ‌ర్త‌ను చంపేసిన భార్య‌…!

ఏడాదికి పైగా రాజ్ కసిరెడ్డి జైలులోనే ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం శంషాబాద్ ఎయిర్పోర్టులో.. నాటకీయ పరిణామాల నడుమ రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసింది. ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడి రంగంలోకి దిగింది. నేరుగా ఇప్పుడు ప్రధాన సూత్రధారిని ఈడి లాక్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.

సమాంతరంగా రెండు దర్యాప్తులు..
కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే దీనికి సమాంతరంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడి కూడా ఎంట్రీ ఇచ్చింది. సిట్ సాధారణ అవినీతి కేసులను నమోదు చేసింది కానీ.. ఈడి మాత్రం మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈడి అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.

Also Read: Grey Marriages: 60 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి…వృద్ధాప్యంలో ప్రేమ..!

మద్యం సిండికేట్, షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు రూ.3,500 కోట్ల ముడుపులు ఎక్కడికి చేరాయి? హవాలా మార్గాల్లో విదేశాలకు ఎలా వెళ్లాయి? అనే మనీ ట్రైల్ గుట్టును పూర్తిగా రట్టు చేసే అవకాశం ఈడి దర్యాప్తులో ఉంది. ఇప్పటికే మనీ లాండరింగ్ పై ఈడి పక్కా ఆధారాలు సేకరించింది. అందులో భాగంగా రూ.441 కోట్ల విలువైన ఆస్తులను ఈడి ముందుగానే అటాచ్ చేసింది.

వైసిపిలో ప్రకంపనలు..
ఈడి దూకుడు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ, ఈడి దాడులు, దర్యాప్తు తీరు గమనిస్తుంటే.. అందరికల్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. రాజ్ కసిరెడ్డి గత ప్రభుత్వంలో నేరుగా సీఎంఓ కి అత్యంత సన్నిహితుడుగా… ఎన్నారై విభాగానికి కీలక ప్రతినిధిగా వ్యవహరించారు.

Also Read: దేవుళ్ల పాత పటాలు, విగ్రహాలను ఏమి చేయాలి…?

ఇప్పటికే వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి.. మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు అన్ని రాజ్ కసిరెడ్డి చూశారని.. ఈ కుంభకోణంలో కర్త,కర్మ, క్రియ ఆయనేనని తేల్చి చెప్పారు.

నిందితుల్లో భయం..
రాజ్ కసిరెడ్డిని ఈడి అదుపులోకి తీసుకుందని తెలియడంతో మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. అయితే వైసీపీకి చెందిన ఒక సిట్టింగ్ ఎంపీ తో పాటు కీలక నేతలకు చేరిన నగదు వివరాలు ఈడి డైరీలో ఎక్కినట్లు తెలుస్తోంది.

ఈ మనీలాండరింగ్ లింకుల ఆధారంగా త్వరలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం ఈడి నోటీసులు ఇస్తుందని ప్రచారం నడుస్తోంది. ఆయన సైతం విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో ఒక రకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: ప్రాణం తీసిన నాటుకోడి కూర‌…!

అతి త్వరలోనే ఆయనకు నోటీసులు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మద్యం కుంభకోణం కేసు విచారణ తుది దశకు వచ్చినట్లు అర్థం అవుతోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు