క్రైం మిర్రర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముప్కాల్ లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద నలుగురు వ్యక్తులు గల్లంతైన ఘటనలో ఇద్దరి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. ఒకరి మృతదేహం ముందుగా లభించగా, తాజాగా మరో మృతదేహాన్ని కూడా గుర్తించి బయటకు తీసినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక బృందాలు, పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, గల్లంతైన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఘటనపై ఆరా తీస్తున్నారు. సీపీ సాయి చైతన్య ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నట్లు సమాచారం. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
also read : కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి గల్లంతు… డిగ్రీ విద్యార్థి మృతి
