Homeఆంధ్ర ప్రదేశ్కోనసీమలోని సరుగుడు తోటల్లో భారీ అగ్నిప్రమాదం – 20 ఎకరాలకు పైగా మంటల విస్తరణ

కోనసీమలోని సరుగుడు తోటల్లో భారీ అగ్నిప్రమాదం – 20 ఎకరాలకు పైగా మంటల విస్తరణ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చింతలమోరి సమీపంలో ఉన్న సరుగుడు తోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 20 ఎకరాల మేర విస్తరించి పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. మంటలతో పాటు ఎగసిపడుతున్న నల్లటి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈదురుగాలుల వేగం ఎక్కువగా ఉండటంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక చర్యలు క్లిష్టంగా మారాయి.

ప్రస్తుతం పరిస్థితిని నియంత్రించేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: బురదలో పడుకుని నిరసన… కురుపాం మండలంలో రోడ్ల దుస్థితిపై గిరిజనుల ఆవేదన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు