Homeతెలంగాణఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..!

ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..!

  • ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు..!

  • ఖరీఫ్ సన్నాహకాలపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సమీక్ష

మిర్యాలగూడ క్రైమ్ మిర్రర్, జూన్ 11: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) హెచ్చరించారు. రానున్న ఖరీఫ్ సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక, యూరియా నిల్వలు, ఎరువుల సరఫరాపై గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) సీఈఓలతో సమీక్ష నిర్వహించారు.

fertilizers and seeds
fertilizers and seeds

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం, పంటల ఎంపిక, విత్తనాలు, ఎరువుల అవసరాలపై అధికారులు వివరాలు సమర్పించారు.

Also Read: తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన.. క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్!!

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ, పీఏసీఎస్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, విత్తనాలు, వ్యవసాయ పథకాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.యూరియా పంపిణీకి ఉపయోగిస్తున్న యాప్‌ను ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటలకు అందుబాటులో ఉంచే అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

అలాగే మండలాల వారీగా యాప్ నిర్వహణ విధానాన్ని అమలు చేస్తే రైతులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు.సమావేశంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. జగదీశ్వర్ రెడ్డి, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, పీఏసీఎస్ సీఈఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read: అమెరికా దాడులు…గ‌ల్లంతైన ముగ్గురు భార‌తీయులు మృతి…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు