Homeతెలంగాణప్రాణం తీసిన నాటుకోడి కూర‌...!

ప్రాణం తీసిన నాటుకోడి కూర‌…!

జనగామ, క్రైమ్ మిర్ర‌ర్‌: నాటుకోడి విషయంలో తలెత్తిన గొడవ లో వ్యక్తి మృతి చెందాడు. కోడికూర ఘర్షణలో తండ్రిపై కొడుకు రోకలిబండతో దాడికి దిగాడు. తండ్రి రమేష్ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో ఘటన జరిగింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో నాటుకోడి తెచ్చి భార్యను కూర వండమని రైతు జంగిలి రమేష్ చెప్పాడు.

Also Read:Alexander Zverev life story: శరీరం పోరాడింది… మనసు గెలిచింది..!

రాత్రి అవుతుంది వద్దని భర్తకు భార్య నచ్చచెప్పింది. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తన తల్లిని ఎందుకు తిడుతున్నామని తండ్రిని కుమారుడు గణేష్ ప్రశ్నించాడు. నన్నే ప్రశ్నిస్తావా.. అంటూ కొడుకు గణేష్ ను చంపపై తండ్రి రమేష్ కొట్టాడు.

క్షణికావేశానికి గురైన గణేష్ పక్కనే ఉన్న రోకలిబండతో తన తండ్రిపై తలపై దాడి చేసాడు. తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయిన రమేష్ . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also Read:దేవుళ్ల పాత పటాలు, విగ్రహాలను ఏమి చేయాలి…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు