Homeతెలంగాణప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

  • క‌లెక్ట‌ర్ కె. హైమావ‌తి

సిద్దిపేట, క్రైమ్ మిర్ర‌ర్: ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి అధికారులు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కె. హైమావ‌తి అన్నారు. ఈస ంద‌ర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణ గురించి ఏంపిడిఓలు, పంచాయతీ రాజ్ ఏఈలు, ఏ పి ఎం జూమ్ సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

జిల్లాలో వివిధ శాఖలకు నిర్దేశించిన పనులను వారికి కేటాయించిన వారాలలో, 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను ప్రకారం కార్యక్రమంను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వం అందజేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విద్యా, వైద్యం, వనమహోత్సవం, తాగునీటి సరఫరా, సన్నబియ్యం, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహ లక్ష్మీ, 500 గ్యాస్ సబ్సిడీ, సన్న వడ్లకు 500 బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, హాస్టల్ లలో డైట్ ఛార్జీలు పెంపుదల, పారిశుధ్యం ఇతరత్ర కార్యక్రమాల గూర్చి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీ లో పలు పథకాల ద్వారా లబ్ది పొందిన వివరాలను ఫ్లెక్సీలు వెయ్యాలని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు రూఫ్ స్థాయిలో ఉన్నవి పూర్తి చేయించాలని ఆయా స్థాయిలో ఉన్న నిర్మాణాలను యుద్ద ప్రతిపాదకన పూర్తి చేయించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపికలో పూరీ గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుగా వారిని ఎంపిక చేయాలని తెలిపారు.

ఈ నెల మొత్తం ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పనులు పూర్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చెయ్యాల్సి ఉంటుంది. ఉపాధి హామీలో కూలీల శాతం పెంచేందుకు కృషి చెయ్యాలని ఏంపిడిఓ లను ఆదేశించారు. మాస్టర్ జెనరేట్ లో సమస్యలు ఎదురైన ఎల్లప్పుడు వారికి టచ్ లో ఉంటూ రోజు వారిగా మానిటర్ చెయ్యాలని డిఆర్డిఓ జయదేవ్ ఆర్యను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments