Homeక్రైమ్కారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

కారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

  • డ్రైవ‌ర్ అజాగ్ర‌త‌, అతివేగం వ‌ల్ల‌నే ప్ర‌మాదం

నిజామాబాద్, క్రైమ్ మిర్ర‌ర్: నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున కారును డ్రైవ‌ర్ అజాగ్ర‌త్త‌గా అతివేగంగా న‌డుప‌డంతో మూడుప‌ల్టీలు కొట్ట‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ప్ర‌మాదానికి క‌ల కారణాల‌ను పోలీసు క‌మిష‌న‌ర్ పి. సాయి చైత‌న్య ఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌శీలించారు. కాగా కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ ఇటుకల బట్టి వ్యాపారస్తుల వద్ద పని చేస్తున్న‌ట్లు తెలిసింది.

కార్మికులు నాందేడ్ కు ఫ్యామిలీ విషయం మాట్లాడడం కోసం వెళ్లి తిరిగి ప్రయాణం అవుతున్న సందర్భంలో గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు ప్రాంతంలో గల మారుతి ఈకో టి.ఎస్ 17 కె 0762 గల వాహనమును కారు డ్రైవర్ అతివేగముగా అజాగ్రత్తగా నడపడం వలన కెనాల్ పై నుంచి క్రిందపడి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్క‌డిక‌క్క‌డే మరణించారు.

నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. . మిగతా ఇద్దరు మామూలు గాయాలతో బయటపడ్డారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగముగా అజాగ్రత్తగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని , ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగముగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు.ఈ కార్యక్ర‌మంలో డిచ్పల్లి ఎస్సై ఎండి ఆరిఫ్ , నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, తదితరులు పాల్గోన్నారు.

తాజావార్తలు