అమరావతి,క్రైమ్‌మిర్రర్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్సునిర్వహించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే భోగాపురం అంతర్జాతీయ మానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ గా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు. టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేశాం. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి. ప్రతి పౌరుడ్నీ భాగస్వామిని చేయాలి. ఉత్తరాంధ్రకు మణిహారంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందని అన్నారు. ఆగస్టు 1వ తేదీన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఎయిర్ పోర్టు పాసింజర్ టెర్మినల్ , ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యుసిటీలను ప్రారంభించుకోబోతున్నాం .
Also Read:కర్ణాటకలో విషాదం: భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య
అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించుకోవాలి. అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏపీకి ఓ లాజిస్టిక్స్ కేంద్రంగా గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఓ గేమ్ చేంజర్. ఎయిర్ పోర్టుతో పాటు ఏఐ డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి ఖనిజాలు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టేకాఫ్ అయితే ఉత్తరాంధ్రతో పాటు యావత్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్టుగా మారుతుంది. ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులను, జమానుల్ని గౌరవిస్తూ ఒకమారు ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నాం. వచ్చే 9 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని ప్రతీ ఇంటా ప్రారంభోత్సవ వేడుక స్పూర్తి చేరాలి.
Also Read:వాసాలమర్రికి మహర్దశ…!
ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించే బాధ్యత తీసుకోవాలి. అరకు కాఫీ, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, స్థానిక కళారూపాలను కూడా ఘనంగా ప్రదర్శిద్దాం. విశాఖ ఎకనామిక్ రీజియన్ లో భోగాపురం ఎయిర్ పోర్టు ఎంతటి కీలకమైన పాత్రపోషిస్తుందో ప్రజలకు వివరించి చెప్పాలి. పరిశ్రమలు, టూరిజం, లాజిస్టిక్స్, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు