Homeజాతీయంఅనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి: అమర్‌నాథ్ యాత్ర భద్రతలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వీరమరణం

అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి: అమర్‌నాథ్ యాత్ర భద్రతలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వీరమరణం

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దుండగులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు.

మధ్యాహ్నం సమయంలో లాల్‌చౌక్ పరిసరాల్లో జరిగిన ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ ఆశిక్ హుస్సేన్ ఖురేషీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనతో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి. ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.

అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ దాడి భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

also read: ఫిఫా వరల్డ్ కప్ సంచలనం: వీక్షణల్లో రికార్డులు – ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం!

తాజావార్తలు