Homeక్రీడలుT20 World Cup 2026: భారత్‌లోనే సెమీఫైనల్స్‌, వేదికలు ఖరారు!

T20 World Cup 2026: భారత్‌లోనే సెమీఫైనల్స్‌, వేదికలు ఖరారు!

* టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్

* ఇక సెమీ ఫైనల్స్ భారత్ లోనే!

* నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్

టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించడంతో భారత్‌ లోనే బిగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో శ్రీలంకను 147లోపు కట్టడి చేయలేక పాక్ ఇంటిదారి పట్టడంతో సెమీస్ వేదికలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. న్యూజిలాండ్ ఫైనల్ చేరడంతో.. ఈడెన్ గార్డెన్స్, వాంఖడేలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

పాక్ అర్హత సాధించి ఉంటే మరోలా..

గ్రూప్ బీ నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్తు పట్టేయగా.. భారత్‌ లోనే షెడ్యూల్ ప్రకారం అనుకున్న సెమీ ఫైనల్, ఫైనల్ వేదికల్ని ఐసీసీ, బీసీసీఐ ఖరారు చేశాయి. ఒకవేళ పాక్ అర్హత సాధించి ఉంటే కొలంబోలోనే సెమీస్, ఒకవేళ ఫైనల్‌కు చేరితే.. ఈ మ్యాచ్ కూడా అక్కడే ఆడించాల్సి వచ్చేది.

నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్

కానీ, సల్మాన్ అఘా బృందం గెలిచినా కివీస్ రన్ రేటు(+1.390)ను అధిగమించలేకపోవడం భారత్‌కు ప్లస్ అయింది. మార్చి 4న జరిగే తొలి సెమీస్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ లో, మార్చి 5న రెండో సెమీస్‌ మ్యాచ్‌ను ముంబైలోని వాంఖడేలో నిర్వహించనున్నారు. టైటిల్ పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8వ తేదీన జరుగనుంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు