HomeUncategorizedపవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత...!

పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత…!

  • తీవ్ర జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం

  •  రాజమండ్రిలో ఓ కార్యక్రమం మధ్యలో వెళ్లిపోయిన వైనం

  •  గవర్నర్ ఎట్ హోమ్ కు దూరం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కాకినాడలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడే జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శనను వీక్షించారు. కార్యక్రమానికి పవన్ తో పాటు ఆయన భార్య అన్నా కొణిదల కూడా పాల్గొన్నారు. అయితే సాయంత్రానికి ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే విజయవాడలోని లోక్ భవన్ లో గవర్నర్ ఇచ్చే సాంప్రదాయ అధికారిక ఎట్ హోమ్ విందుకు హాజరు కాలేకపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు అధికారికంగా ధ్రువీకరిస్తూ లోక్ భవన్ అధికారులకు ముందస్తు సమాచారం అందించాయి.

అనారోగ్య సమస్యలతో…

Also Read:అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నలుగురు మృతి, ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతు

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొన్న ఆ మధ్యన ముంబైలో శస్త్ర చికిత్స కూడా జరిగింది. కొద్ది రోజులపాటు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. హైదరాబాదులోని తన నివాసానికి పరిమితం అయ్యారు. అయితే ఈ నెల 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటినుంచి శాఖపరమైన విధులతోపాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఇటీవల విశాఖలో జరిగిన అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవానికి హాజరయ్యారు. మరోవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కాకినాడ వచ్చారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో ఇంటికి వెళ్ళిపోయారు. గవర్నర్ ఇచ్చే తేనేటి విందుకు హాజరు కాలేనని సమాచారం ఇచ్చారు.

కార్యక్రమం మధ్యలోనే…

Also Read:బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బంపర్ ఆఫర్…!

వాస్తవానికి ఉదయం కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రాజమండ్రి కి వెళ్లారు. అక్కడ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంట్రల్ క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంకు ను ప్రారంభించారు. అదే సమయంలో అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇటీవల కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడం.. వైద్యులు సూచించినన్ని రోజులు విశ్రాంతి తీసుకోకపోవడం, వరుస పర్యటనలు, సమీక్షల్లో పాల్గొనడం వల్ల తీవ్ర ఒత్తిడి కిలోనై జ్వరం బారిన పడినట్లు వైద్యులు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనను జారీ చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు