Homeతెలంగాణస్వాతంత్ర వేడుకలకు దూరంగా జగన్...!

స్వాతంత్ర వేడుకలకు దూరంగా జగన్…!

  • తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కనిపించని వైసీపీ అధినేత

  • బెంగళూరు జెండా ఆవిష్కరణకు సంబంధించి బయటకు రాని దృశ్యాలు

  • అప్పుడే ప్రత్యర్థుల విమర్శనాస్త్రాలు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారా? ఎందుకు ఆయన దూరంగా ఉన్నారు? పార్టీ కార్యాలయానికి ఎందుకు హాజరు కాలేదు? బెంగళూరులో జరిపితే అందుకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు ఎందుకు బయటకు రాలేదు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ప్రత్యర్ధులకు ఇదో రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా…

Also Read:అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నలుగురు మృతి, ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతు

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని జిల్లాల్లో ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల వద్ద వేడుకలు జరిపాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ద్వితీయ శ్రేణి నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు. ఆయన బెంగళూరుకు పరిమితం అయినట్లు తెలుస్తోంది. పోనీ అక్కడ వేడుకలు జరిపి ఉంటే కచ్చితంగా సోషల్ మీడియాకు వాటికి సంబంధించిన వివరాలు విడుదల చేసేవారు. కేవలం స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక ట్వీట్ తోనే వదిలేశారు జగన్. ఎటువంటి వివరాలు రాకపోవడంతో ఇప్పుడు అదే హాట్ టాపిక్ అవుతుంది. అందరిలోనూ అనుమానాలు పెంచుతోంది.

తప్పుపడుతున్న శ్రేణులు…

Also Read:విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష.. ఫోర్ట్ సెయింట్ జార్జిలో అందరి చూపు ఆమెపైనే

స్వాతంత్ర దినోత్సవము అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు ఎక్కడ ఉన్న జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ఆనవాయితీ.. గల్లి నుంచి ఢిల్లీ నేత వరకు ఈ వేడుకలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారన్న వార్త విమర్శలకు తావిస్తోంది. స్వపక్షంలో ఆయన యాక్టివ్ గా ఉండాల్సింది పోయి.. ఇలా చేయడం ఏంటనే ప్రశ్నా వినిపిస్తోంది. సొంత పార్టీ శ్రేణులు సైతం దీనిని తప్పుపడుతున్నాయి.

సోషల్ మీడియాలో ట్రోల్స్…

Also Read:వరుసగా రెండోసారి గైర్హాజరు.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు రాహుల్, ఖర్గే దూరం

ఇటీవల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో ఆయన సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అవుతున్నారు. విపరీతంగా ట్రోల్స్ కు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహార శైలిని సమర్థించడం.. నిన్ననే కర్నూలు వెళ్లి చేసిన వ్యాఖ్యలు కూడా ట్రోల్స్ కు కారణం అవుతున్నాయి. ఈరోజు ఏకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు డుమ్మా కొట్టడం రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు