Homeక్రైమ్అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నలుగురు మృతి, ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతు

అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నలుగురు మృతి, ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతు

క్రైమ్ మిర్రర్ : భారీ వర్షాలు అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎగువ సుబన్‌సిరి, దిబాంగ్‌ వ్యాలీ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా నలుగురు మృతి చెందగా.. ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఎగువ సుబన్‌సిరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

మరోవైపు దిబాంగ్‌ వ్యాలీ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించడంతో ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సైన్యం, స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో నదులు, వాగుల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
also read :బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బంపర్ ఆఫర్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు