-
అన్ని కేసుల్లో ఆధారాలు సేకరించిన ప్రభుత్వం
-
పక్క వ్యూహంతో పట్టు బిగించాలని చూస్తున్న వైనం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తదుపరి అరెస్ట్ ఆయనదేనని స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా కొడాలి నాని అరెస్టుపై రకరకాలుగా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి సరైన ఆధారాలు దొరకడంతో ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఆయన నిర్వర్తించిన సివిల్ సప్లై కు సంబంధించి అవినీతిపై ఆధారాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి చిక్కినట్లు సమాచారం. దీంతో ఏ క్షణం అయినా కొడాలి నాని అరెస్టు ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సరైన ఆధారాలతో.. పట్టు బిగించడం ద్వారా.. వల్లభనేని వంశీ మాదిరిగా.. నెలల తరబడి జైల్లో ఉంచే ప్రణాళిక దాదాపు ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.
టిడిపి శ్రేణుల ఎదురుచూపు…
Also Read:రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక డాక్టరేట్!
కొడాలి నాని అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అరెస్ట్ ఆయనదేనని ప్రచారం నడిచింది. కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం కొడాలి నాని విషయంలో మినహాయింపు ఇచ్చింది. అయితే అది మినహాయింపు కాదు అని.. సరైన సమయంలో.. సరైన ఆధారాలతో వల పన్ని పట్టు బిగించాలన్న వ్యూహం అని స్పష్టమవుతోంది. కానీ కొడాలి నాని అరెస్టు జరగకపోవడం పై తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసహనం పెరుగుతోంది. దానికి కారణం కొడాలి నాని వ్యవహరించిన తీరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై రెచ్చిపోయారు. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై వ్యక్తిగతంగా విరుచుకుపడేవారు. ఆ ఇద్దరు నేతలపై మాత్రమే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించిన వారిపై కూడా నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అందుకే కొడాలి నాని అరెస్టును ఎక్కువ మంది టిడిపి శ్రేణులు కోరుతూ వచ్చాయి.
వంశీ కంటే ముందే…
Also Read:భార్యపై ప్రేమతో మరో తాజ్ మహల్.. మధ్యప్రదేశ్లో వ్యాపారవేత్త అద్భుత కానుక!
వాస్తవానికి వల్లభనేని వంశీ మోహన్ కంటే ముందే కొడాలి నాని అరెస్టు జరుగుతుందన్న ప్రచారం నడిచింది. కానీ ఇంతలో కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స కూడా చేసుకున్నారు. ఆపరేషన్ అనంతరం కొద్ది నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అందుకే కూటమి కొడాలి నాని పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనపై ఉన్న పాత కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే.. కనీసం బెయిల్ కూడా రాకుండా ఉండే విధంగా చట్టపరంగా పట్టు బిగించాలన్నది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ మాదిరిగా నెలల తరబడి జైల్లో రిమాండ్ ఖైదీగా ముంచే ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం.
చాలా రకాల ఫిర్యాదులు…
Also Read:కంగనా రనౌత్ మరోసారి క్లారిటీ.. ‘జనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలపై ఘాటు వివరణ
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పై విపరీతంగా ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు పది వరకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా వైసిపి హయాంలో పౌరసరఫరాలకు సంబంధించిన మంత్రిగా ఉండేవారు కొడాలి నాని. నాడు పేర్ని నానికి సంబంధించిన గోదాముల్లో బియ్యం పక్కదారి పట్టడం పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొడాలి నాని హస్తము ఉన్నట్లు కూడా ఆధారాలు సేకరించిందట ప్రభుత్వం. మరోవైపు గుడివాడలో కొడాలి నాని అనుచరుల చేతుల్లో కబ్జాకు గురైన ఆస్తులన్నీ వెనక్కి ఇప్పించారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. స్థానికంగా కూడా కొన్ని రకాల కేసులు నమోదయ్యాయి కొడాలి నాని. అయితే వీటన్నింటిపై గత కొంతకాలంగా ఆధారాలు సేకరించారు పోలీసులు. వాటిని అడ్డం పెట్టుకొని కొడాలి నాని అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
