Homeక్రీడలుT20 WC 2026: ఇవాళే భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌.. సెమీస్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిందే!

T20 WC 2026: ఇవాళే భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌.. సెమీస్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిందే!

* ఇవాళ భారత్, వెస్టిండీస్ మ్యాచ్

* గెలిస్తేనే సెమీస్ కు భారత్

* వర్షం పడితే టీమిండియా ఆశలు గల్లంతు!

టీ20 ప్రపంచ కప్‌ 2026లో గ్రూప్‌-1 సూపర్‌-8 మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్‌ కోసం భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫిబ్రవరి 26  వెస్టిండీస్‌ సౌతాఫ్రికా చేతిలో ఓడటం.. భారత్‌ జింబాబ్వేపై ఘన విజయం సాధించడంతో గ్రూప్‌-1 నుంచి రెండో సెమీస్‌ బెర్త్‌ పై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం వెస్టిండీస్‌, భారత్‌ చెరి రెండు పాయింట్లు కలిగి ఉన్నాయి. రన్‌ రేట్‌ మాత్రం భారత్‌తో పోలిస్తే విండీస్‌ది చాలా ఎక్కువగా ఉంది.

ఎవరు గెలిస్తే వాళ్లే సెమీస్ కు!

ఇవాళ భారత్‌-విండీస్‌ మధ్య కోల్‌కతా వేదికగా జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారే సెమీస్‌కు చేరతారు. ఒకవేళ ఆ మ్యాచ్‌ ఏ కారణంగా అయినా రద్దైతే మాత్రం రన్‌రేట్‌ అ‍త్యంత కీలకమవుతుంది. మ్యాచ్‌ రద్దైతే ఇరు జట్ల ఖతాలో చెరి 3 పాయింట్లు ఉంటాయి. రన్‌ రేట్‌ విషయానికొస్తే.. విండీస్‌కు (1.791), భారత్‌  (-0.100) కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉంది కాబట్టి, ఆ జట్టుకే సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుంది. భారత్‌-విండీస్‌ మ్యాచ్‌కు ప్రస్తుతానికి ఎలాంటి వర్షాటంకాలు లేవు.

వర్షం పడకూడదని కోరుకుంటున్నటీమిండియా అభిమానులు

మ్యాచ్‌ సజావుగా సాగితే విజయం తమదేనని దీమాగా ఉన్నారు టీమిండియా అభిమానులు. ఈ టోర్నీ ఆరంభం నుంచి అజేయ జట్టుగా ఉండిన వెస్టిండీస్‌ .. సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి కాన్ఫిడెన్స్‌ ను కోల్పోగా.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వేపై ఘన విజయం సాధించి టీమిండియా మాంచి జోష్‌లో ఉంది.  ఇదే జోష్‌ను విండీస్‌ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ ఖాయం. సెమీస్‌లో భారత్‌.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లలో ఏదో ఒక్క జట్టును ఎదుర్కొనే అవకాశం ఉంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు