Homeఆంధ్ర ప్రదేశ్హెచ్ఐవి డేంజ‌ర్ బెల్స్‌

హెచ్ఐవి డేంజ‌ర్ బెల్స్‌

  • పెరిగిన ఎయిడ్స్ మ‌ర‌ణాలు
  • అవ‌గాహ‌న లోపంతోనే వ్యాధి వ్యాప్తికి కార‌ణం

హైదరాబాద్, క్రైం మిర్ర‌ర్ః

తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. గతంలో కేసులు తగ్గిన‌ప్ప‌టికీ ఇటీవలికాలంలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మరణాలు కూడ ఎక్కువ‌గానే పెరుగుతున్నాయి.

.కేంద్రం ప్రకారం, 2020–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది హెచ్‌ఐవీతో మరణించారు. మొత్తం 44,140 మంది మ‌ర‌ణించారు.
ఏపీలో పెరిగిన‌మ‌ర‌ణాల సంఖ్య‌…

ఏపీలో హెచ్‌ఐవీ మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్, చికిత్స సౌకర్యాల కొరత, అవగాహన లోపం కారణంగా వ్యాధి బాధితులు మరణిస్తున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఈ ట్రెండ్‌ను అరికట్టే చర్యలు చేపట్టాలి.

టెస్టింగ్ లోపాల స‌మ‌స్య‌…
తెలంగాణలోని నగరాల్లో ఏఆర్‌టి సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, గ్రామాల్లో వ్యాప్తి, టెస్టింగ్‌ లోపాలు సమస్య. యువతలో వ్యాప్తి పెరుగుతోంది.

వైరస్‌ గుర్తింపులో జాప్యం కారణంగా మరణాలు సంభ‌విస్తున్నాయి. వైద్య సేవల ఆలస్యం, స్టిగ్మా, టెస్టింగ్‌లో భయం మరణాలకు దారితీస్తున్నాయి.

కాగా ఓవ‌రాల్ చూస్తే రెండు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఉచిత టెస్టింగ్, ఏఆర్‌టీ మందులు, అవగాహన కార్యక్రమాలు పెంచాలి.

యువతపై దృష్టి పెట్టి, స్క్రీనింగ్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తే మరణాలు తగ్గించే అవ‌కాశం ఉంటుంది. దీని కేంద్ర, రాష్ట్రాలు కలిసి చర్యలు తీసుకుంటే అరిక‌ట్ట‌వ‌చ్చు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు