HomeతెలంగాణBreaking News: రేపే మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా..!

Breaking News: రేపే మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలోనే అధికారిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

 

ఫిబ్రవరి నెలలోనే ఎన్నికల తతంగం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత, అంటే జనవరి నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ లేదా పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. తుది ఓటర్ల జాబితా జనవరి 10, 2026న ప్రచురించబడింది.

 

వార్డుల వారీగా, పోలింగ్ స్టేషన్ల వారీగా తుది జాబితాలు జనవరి 12 మరియు జనవరి 16 తేదీలలో ప్రచురించబడతాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు