హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతురాలు రేణుక(26)గా పోలీసులు గుర్తించారు. కాగా హటల్ గ్రాండ్ లాడ్జ్‌లో సదరు యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉన్న స్థితిలోకనిపించినట్లు తెలిపారు. ఫారూఖ్ అనే వ్యక్తితో కలిసి రేణుక హోటల్‌లో గది బుక్ చేసుకుంది. అనంతరం ఫారూఖ్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
Also Read:Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు!
ముమ్మాటికి హత్యే…
మృతురాలిది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతిది హత్యా, ఆత్మహత్యా అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ వీసా మోసం… ఒమన్ ప్రయాణానికి నకిలీ వీసాలతో 20 మంది మహిళలు!