Homeక్రీడలుబేగంపేట విమానాశ్రయంలో "వింగ్స్ ఇండియా 2026" ఈవెంట్

బేగంపేట విమానాశ్రయంలో “వింగ్స్ ఇండియా 2026” ఈవెంట్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: జనవరి 28 నుండి జనవరి 31, 2026 వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అయిన “వింగ్స్ ఇండియా 2026″ ఈవెంట్ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి “కె. రామ్మోహన్ నాయుడు నేడు బుధవారం (జనవరి 28) ఈ ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు.

భారతీయ విమానయానం భవిష్యత్తును సుగమం చేయడం అనే ఇతివృత్తంతో, రాబోయే పదేళ్లలో భారత్‌ను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో 31కి పైగా విమానాల ప్రదర్శన, సూర్యకిరణ్ మరియు మార్క్ జెఫరీస్ ఏరోబాటిక్ బృందాల సాహసోపేత విన్యాసాలు కనుల విందు చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుండి ప్రతినిధులు, ఎయిర్‌బస్ మరియు బోయింగ్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యం. మొదటి రెండు రోజులు (జనవరి 28, 29) వ్యాపార నిమిత్తం కేటాయించబడగా, చివరి రెండు రోజులు (జనవరి 30, 31) సాధారణ ప్రజల సందర్శనకు అనుమతి ఉంటుంది. ఆసక్తి గల వారు Wings India అధికారిక వెబ్‌సైట్ లేదా BookMyShow ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు