Homeఅంతర్జాతీయంపశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు...?!

పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు…?!

  • భారీగా ఆశావహులు

  • ముందంజలో సువెందు అధికారి

  • దిలీప్ ఘోస్ తో పాటు సుకాంత మజుందార్ పేర్లు

  • హై కమాండ్ ది తుది నిర్ణయం

  • రంగంలోకి అమిత్ షా

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? బిజెపి హై కమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? సీఎం పదవి వరించేది ఎవరికి? మమతా బెనర్జీ తర్వాత సారధ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? దేశ రాజకీయాల్లో దీనిపైన ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రముఖంగా ఓ ముగ్గురి పేరు వినిపిస్తోంది. వీరిలో ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది.

మమతా బెనర్జీని ఓడించిన సువెందు
15 ఏళ్ల కృషి ఫలితంగా పశ్చిమ బెంగాల్లో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. బలమైన వ్యూహాలతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను మట్టికరిపించింది. అయితే కాబోయే బిజెపి ముఖ్యమంత్రి ఎవరు? అనే దానిపై బలమైన చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా సువెందు అధికారి పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి నమ్మిన బంటుగా ఉండేవారు సువెందు అధికారి. 2020లో తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు.

తాజా ఎన్నికల్లో సైతం భవానిపురం నియోజకవర్గం లో మమతా బెనర్జీని దారుణంగా ఓడించారు. 15వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. అందుకే ఈసారి సువెందు అధికారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయనకు ఆర్ఎస్ఎస్ మద్దతు లేదని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. కానీ రెండు చోట్ల గెలిచిన ఆయన వైపే బీజేపీ హై కమాండ్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారంలో ఉంది.

జాబితాలో ప్రముఖులు..
బెంగాల్ బిజెపి మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బిజెపి వ్యాప్తిలో ఆయన కీలకపాత్ర పోషించారు. సంస్థాగత అనుభవం ఆయన సొంతం. బిజెపి సిద్ధాంతాలను పాటించే నాయకుడిగా గుర్తింపు ఉంది. అందుకే ఆయనను గట్టి పోటీదారుడుగా భావిస్తున్నారు విశ్లేషకులు. మరోవైపు బిజెపి ప్రముఖుల్లో ఒకరైన సుఖంత మజుందార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆయనకు. కేంద్ర నాయకత్వంతో ఉన్న సఖ్యత కారణంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారని ప్రచారంలో ఉంది.

మరో సీనియర్ నేత షమిక్ భట్టాచార్య పేరు కూడా వినిపిస్తోంది. పార్టీలో ఏకాభిప్రాయాన్ని సాధించే వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. మిగతా వారి మాదిరిగా ఆయనకు పాపులారిటీ లేదు కానీ.. సీనియారిటీతో పాటు అనుభవం దృష్ట్యా ఆయన పేరు కూడా సీఎం రేసులో ఉంది. అయితే అన్ని రకాల సమీకరణలను హైకమాండ్ పరిగణలోకి తీసుకోనుంది. కులంతో పాటు సామాజిక ప్రాతినిధ్యం, సంస్థాగత బలం, కేంద్ర నాయకత్వ వ్యూహం వంటివి సీఎం అభ్యర్థిని నిర్ణయించనున్నాయి పశ్చిమ బెంగాల్ లో..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు