Homeక్రైమ్దిల్‌సుఖ్‌నగర్‌: అర్ధరాత్రి 40మంది అదుపులోకి...!

దిల్‌సుఖ్‌నగర్‌: అర్ధరాత్రి 40మంది అదుపులోకి…!

క్రైమ్ మిర్రర్,దిల్‌సుఖ్‌నగర్‌: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. మహిళల భద్రతపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టారు.

సీపీ సుమతి సాధారణ మహిళలా రాత్రివేళ రోడ్డుపై నిలబడగా, కొందరు యువకులు ఆమెను చుట్టుముట్టి అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడే ఉన్న సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు.

అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులు మరియు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో రాత్రివేళ మహిళల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు కఠిన చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పోలీసులు ఇలాంటి చర్యలను కొనసాగిస్తామని, అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు