-అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై బూతుల పర్వం
-ఇప్పుడు పార్టీ డోర్స్ క్లోజ్
-తాడేపల్లి కార్యాలయంలోకి రానివ్వని వైనం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రెచ్చిపోయేవారు. ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. యూట్యూబ్ ఛానళ్ల లో, సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రత్యర్థులపై తిట్ల దండకం అందుకునేవారు. అటువంటి వారిలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఒకరు. అయితే ఇప్పుడు అదే బోరుగడ్డ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద సంచలన ఆందోళనకు దిగారు. నాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం, అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం అందర్నీ బూతులు తిట్టి మైలేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు. నమ్మిన నాకే ద్రోహం చేస్తారా అంటూ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి పై ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇరకాటంలో పడినట్లు అయ్యింది.
పార్టీ కోసం పరితపన..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు బోరుగడ్డ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం, అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా, పచ్చి బూతులతో తిట్టేవారు. అప్పట్లో స్వేచ్ఛగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చే ఆయనకు.. ఇప్పుడు మాత్రం రానివ్వడం లేదు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదు అనేది బోరుగడ్డ ఆరోపణ. తన అనుచరుల ద్వారా తనపై రౌడీ షీటర్ అనే తప్పుడు ముద్ర వేయించి.. పార్టీకి దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని బోరుగడ్డ అనిల్ ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై ఎలాంటి రౌడీషీట్ లేదని ఏకంగా హైకోర్టు స్పష్టం చేస్తుంటే.. వైసీపీ పెద్దలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. ఈ విషయంలో తప్పుడుగా ప్రచారం చేస్తున్న వారికి పరువు నష్టం దావా కింద లీగల్ నోటీసులు పంపినట్లు కూడా చెబుతున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు, కోర్టులను సైతం బూరుగడ్డ లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు తనపై రౌడీ షీటర్ ముద్ర వేస్తున్నారని ఫీల్ అవుతున్నారు.
ప్రభుత్వ అండతో..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ ఏ స్థాయిలో రెచ్చిపోయేవారో తెలియంది కాదు. అప్పట్లో ప్రభుత్వ సహాయం ఆయనకు దండిగా అందేది. ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండేవి. కానీ ఇటువంటి వారి నోటి దూకుడుతోనే వైసీపీకి నష్టం జరిగిందని ఆ పార్టీ నాయకత్వం తెలుసుకుంది. అందుకే పూర్తిగా పక్కన పెట్టేసింది. కూటమి వచ్చిన తర్వాత కేసుల మీద కేసులతో బోరుగడ్డ అనిల్ కుమార్ కు అసలు తత్వం బాధపడింది. నోటికి తాళం పడింది కానీ.. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన వైసీపీలో మాత్రం ఆయనకు ఆదరణ లేకుండా పోయింది. వైసీపీతోపాటు జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్ముకుని ఇతరులపై విరుచుకుపడిన బోరుగడ్డ లాంటి వారికి ఇటువంటి గతి రావడంతో ఎవరు జాలి పడటం లేదు కూడా.
‘నల్లారి’కి ఏపీ బీజేపీ పగ్గాలు!
ఆదిలాబాద్ లో కొత్త ఎయిర్ పోర్ట్!
