Homeఆంధ్ర ప్రదేశ్మద్యం కుంభకోణంలో జగన్...!

మద్యం కుంభకోణంలో జగన్…!

  • అంతిమ లబ్ధిదారుడు ఆయనే..

  • అప్రూవర్గా మారిన a3 నిందితుడు సత్య ప్రసాద్

  • కోర్టుకు కీలకమైన స్టేట్మెంట్స్

  • మాజీ సీఎంకు త్వరలో నోటీసులు

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? నిందితుల్లో కీలకమైన వ్యక్తి అప్రూవర్గా మారారా? కుంభకోణంలో నగదు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు చేరిందని చెప్పేసారా? లిక్కర్ విధానంలో పాత రూల్స్ కు స్వస్తి పలికి.. డిజిటలైజేషన్ ను పక్కన పెట్టడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసిపి హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. కేసులు నమోదు చేసి వరుసగా అరెస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. అయితే కీలకమైన విచారణ జరుగుతున్న సమయంలో.. లిక్కర్ అక్రమ రవాణా కేసులో a3 నిందితుడిగా ఉన్న సత్య ప్రసాద్ అప్రూవర్ గా మారేందుకు పిటీషన్ దాఖలు చేశాడు. అందుకు సిఐడి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో కోర్టులో 164 స్టేట్మెంట్లో సత్యప్రసాద్ కీలక విషయాలను వెల్లడించారు.

కీలక అంశాలు వెల్లడి…

Also Read:డూప్లికేట్ గాంధీల పేర్లు పెడితే ఊరుకోం : బండి సంజయ్

a3 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. గతంలో సిగేట్ అనే సంస్థ ద్వారా మద్యం విక్రయాలు జరిగేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వ్యవస్థను రద్దు చేశారు. మాన్యువల్ విధానంలో విక్రయాలకు మార్గం సుగమం చేశారు. మద్యం అనుమతులు, లైసెన్సుల మంజూరు లో భారీ మొత్తం చెల్లింపులు జరిగాయి. ఎక్కువ మతాలు చెల్లించిన వారికి అనుకూలంగా అనుమతులు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. ఆయనతో జరిగిన మీటింగులకు కేసిరెడ్డి, వాసుదేవ రెడ్డి హాజరయ్యే వారు. విధాన రూపకల్పన నుంచి వసూళ్ల మార్గాలు, కలెక్షన్ల పంపిణీ వరకు సమస్తము వీరే దగ్గరుండి నడిపించారు. ఈ కుంభకోణంలో వీరిద్దరూ ప్రధాన సూత్రధారులు. ఈ వ్యవహారంలో సుమారు 3500 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లాయి.. అంటూ సత్య ప్రసాద్ కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకొందరు పేర్లు కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

ఈడీ సైతం…

Also Read:ఏఐ ప్రాణం తీసింది: చాట్‌జీపీటీ తప్పుడు సలహాతో యువకుడి మృతి.. ఓపెన్ఏఐ సంస్థపై తల్లి దావా!

మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. ఈ డిసైతం కొన్ని అరెస్టులు జరిపింది. అయితే ఏకంగా ఒక నిందితుడు అప్రూవర్ గా మారి పూర్తిస్థాయి విషయాలను వెల్లడించడం విశేషం. అయితే ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం జగన్ అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక నిందితుడు అప్రూవర్ గా మారి ఈ విషయాలను నేరుగా కోర్టుకు తెలపడంతో.. న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందంతో పాటు ఈడి రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు