-
కెసిఆర్ పై తొలుత భూ అస్త్రం
-
తర్వాత లగ్జరీ ఆస్తుల చిట్టా
-
రెండేళ్ల కిందటే సంపాదించిన ముఖ్యమంత్రి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కెసిఆర్ కుటుంబ ఆస్తులకు సంబంధించిన అంశం ఇప్పుడు పొలిటికల్ గా హైలెట్ అవుతోంది. మొన్నటి వరకు సీఎం రేవంత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది గులాబీ పార్టీ. అయితే దానిని వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు రేవంత్. ఆధారాలు,, వివరాలతో శాసనసభ వేదికగా చీల్చి చెండాడారు. అయితే సభలో రేవంత్ ఇలా ప్రకటిస్తారని గులాబీ పార్టీ ఊహించలేదు. కానీ ఆ పార్టీ శాసనసభ నుంచి సైడ్ చేసి.. ఒక పద్ధతి ప్రకారం కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తుల వివరాలను ప్రకటించేశారు సీఎం రేవంత్. అయితే అవి తెలంగాణ రాజకీయాలపై గట్టి ప్రభావమే చూపుతున్నాయి.
సమయం కోసం వేచి చూసి…
Also Read:అడగగానే ఓకే అన్నారు.. లోకేష్ పై ప్రశంశలు కురిపించిన చాగంటి!
ఇప్పటివరకు కేసీఆర్ భూముల లెక్కలనే బయట పెట్టారు సీఎం రేవంత్. మున్ముందు అసలు లగ్జరీ ఆస్తుల చిట్టా బయటకు రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం రేవంత్ ఈ ఆస్తులతో పాటు లగ్జరీ ఆస్తుల వివరాలను రెండేళ్ల క్రిందటే సేకరించారు. సమయం కోసం ఆయన వేచి చూస్తూ వచ్చారు. కెసిఆర్ ఆస్తులు, లగ్జరీ వాచ్ లు, ఖరీదైన జ్యువెలరీ వివరాలతో కూడిన పక్కా చిట్టాను రెండేళ్ల క్రితమే సంపాదించి సిద్ధంగా పెట్టుకున్నారు. ముందే బయటకు తీసి రాజకీయంగా పలచన చేయడం రేవంత్ రెడ్డికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి చేయి దాటుతుండడంతోనే ఈ ఆస్తుల ప్రయోగం చేశారు. త్వరలో లగ్జరీ ఆస్తుల వివరాలను కూడా బయట పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడితో కథ ముగిసి పోలేదని.. మున్ముందు పరిణామాలు మరింత హాట్ గా ఉంటాయన్న టాక్ నడుస్తోంది.
కేంద్ర పెద్దల ఆదేశాలు …
Also Read:ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ – జనసేన వాటా ఎంత?
గడిచిన కొన్ని నెలలుగా గులాబీ పార్టీ తన రాజకీయాన్ని రెట్టింపు చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ శ్రేణులు దాడుల తీవ్రతను విపరీతంగా పెంచేసాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగానే రేవంత్ కు ఒక పొలిటికల్ లీక్ ఇచ్చారు. మీలో మునుపటి ఫైర్ లేకుంటే మాత్రం కష్టం అన్నది తేల్చేశారు. దీంతో రేవంత్ కెసిఆర్ పై భూముల అస్త్రాన్ని ప్రయోగించారు. ఒక్క భూములు మాత్రమే కాదు.. తరువాత లగ్జరీ ఆస్తులు కూడా బయట పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.
రేవంత్ రివర్స్ పంచ్…
Also Read:డూప్లికేట్ గాంధీల పేర్లు పెడితే ఊరుకోం : బండి సంజయ్
రేవంత్ రెడ్డి పాలనపై పూర్తిగా దృష్టిపెట్టారు. రాజకీయ దూకుడును తగ్గించారు. ఈ క్రమంలో గులాబీ పార్టీ నుంచి దాడుల తీవ్రత పెరిగింది. దాని గురించి రేవంత్ ఆరా తీయగా.. కేంద్ర పెద్దల నుంచి తెలంగాణ కీలక నేతకు వచ్చిన ఆదేశం అని తెలుసుకున్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే గులాబీ పార్టీ నేతలు విమర్శల దాడి పెంచారు. రేవంత్ ను అవినీతి ఊబిలో దించితే అందరూ ఒకటే నన్న భావన తెలంగాణ సమాజంలో కల్పించేందుకు ఎత్తుగడవేశారు. విషయం తెలుసుకున్న రేవంత్ తిరిగి రివర్స్ అయ్యారు. గట్టిగానే తన రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కెసిఆర్ కుటుంబమే సమాధానం చెప్పుకోవాల్సిన రక్షణాత్మక స్థితిలో నెట్టేశారు. రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు రహస్యంగా దాచిపెట్టిన పాత ఆస్తుల బయట పెట్టేయడంతో గులాబీ పార్టీ నిద్రలేని రాత్రులు గడుపుతోంది. అయితే ఇప్పటివరకు భూములు మాత్రమే.. మున్ముందు మాత్రం లగ్జరీ ఆస్తుల వివరాలను సైతం బయటపెట్టేందుకు సరైన సమయం, వ్యూహంతో ఉన్నారు రేవంత్.
