క్రైమ్ మిర్రర్, సినిమా:- సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ బలంగా ఉంటే బడ్జెట్‌తో పనిలేదని, చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ వారు బ్రహ్మరథం పడతారని ‘మండాడి’ సినిమా మరోసారి నిరూపించింది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై, ఇప్పుడు థియేటర్లలో భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఇప్పటివరకు తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సూరి, ఈ చిత్రంతో హీరోగా మారి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుతమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను దర్శకుడు మతిమారన్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఏఐ ప్రాణం తీసింది: చాట్‌జీపీటీ తప్పుడు సలహాతో యువకుడి మృతి.. ఓపెన్ఏఐ సంస్థపై తల్లి దావా!
ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ నటుడు సుహాస్. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్, ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించి మెప్పించారు. హీరో, విలన్ల మధ్య సాగే పోరు, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాను విజయతీరాలకు చేర్చాయి.ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, ఒక చిన్న సినిమాగా మొదలైన ‘మండాడి’ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు వంద కోట్ల మైలురాయిని దాటడం విశేషం. కేవలం థియేట్రికల్ రన్‌లోనే కాకుండా, డిజిటల్ రైట్స్ పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా ఓటీటీ (OTT) హక్కులు ఏకంగా రూ.40 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని సినీ వర్గాల సమాచారం. ఒక కమెడియన్ హీరోగా మారి చేసిన మొదటి ప్రయత్నమే ఈ స్థాయి విజయాలను, భారీ వసూళ్లను నమోదు చేయడం విశేషం.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై ఉత్కంఠ – జనసేన వాటా ఎంత?
