Homeవైరల్ఇండోర్ వృద్ధాశ్రమంలో బాలుడి దౌర్జన్యం... వీడియో వైరల్

ఇండోర్ వృద్ధాశ్రమంలో బాలుడి దౌర్జన్యం… వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన దాడి ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. కేవలం 14 ఏళ్ల బాలుడు అక్కడ నివసిస్తున్న వృద్ధ మహిళలపై కర్రతో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇండోర్‌లో మేరిమాత నీటి ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఉన్న మహారాణా ప్రతాప్ వెల్ఫేర్ సొసైటీ వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే బాలుడు మహిళలపై దాడి చేయడం గమనార్హం. ఈ దృశ్యాలను ఎవరో వీడియోగా చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది.

వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు వెంటనే స్పందించారు. బాణగంగ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వృద్ధాశ్రమం నిర్వహణపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్వాహకురాలిని పోలీసులు ప్రశ్నించారు. అవసరమైన సూచనలు ఇచ్చిన తర్వాత ఆమెను విడుదల చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వృద్ధుల భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

also read: మూవీస్ లోకి తేజస్విని ఎంట్రీ…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు