Homeతెలంగాణకేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

  • పోక్సో బాధిత కుటుంబాన్ని బెదిరింపు.

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

  • పల్లె రవి కుమార్ గౌడ్ డిమాండ్.

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, వారిని బెదిరించడం అత్యంత దుర్మార్గమని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి, బర్తరఫ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్, మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

సోమవారం మర్రిగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమారుడు భగీరథ ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు, బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా, మూడు నెలల నుంచి కేసు నమోదు చేయకపోవడం వెనుక, ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చిన బాధితులను బెదిరించడం, ఏ ధర్మమని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ ముందు, బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని, సదరు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైన భగీరథను, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పందుల యాదయ్య, మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ సంతోష్ యాదవ్, మాజీ సర్పంచ్ యడ్ల శ్రీరాములు, బీసీ నాయకులు పాలకూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు