Homeజాతీయంవిజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్!.. నెట్టింట జోరు చర్చ

విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. బర్త్‌డే విషెస్ కూడా లేవ్!.. నెట్టింట జోరు చర్చ

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సినీ హీరో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత తళినాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీనితోపాటు గత కొన్ని నెలలుగా నటి త్రిష కృష్ణన్ పేరుతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్‌ పేరుతో కలిపి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ మీడియా సైతం వేడి వేడి వార్తలు వండి వడ్డించింది. Ghilli, Leo, GOAT వంటి హిట్ చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు.

ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో విజయ్-త్రిషల మధ్య సంబంధంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ – త్రిష వీరిద్దరూ విడిపోయారంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం తాజాగా విజయ్‌ను సోషల్ మీడియాలో త్రిష అన్‌ఫాలో చేయడమే కారణం. ఈ ఏడాది జూన్‌ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

కానీ త్రిష మాత్రం విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం ఈ రెండు ఘటనలు వెనువెంటనే జరిగాయి. విజయ్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇది తొలి పుట్టిన రోజు కావడంతో త్రిష విషెస్‌ కోసం సర్వత్రా ఎదురు చూశారు. గత కొన్నేళ్లుగా త్రిష, విజయ్‌తో కలిసి తీసుకున్న అరుదైన ఫొటోలను పంచుకుంటూ, హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చింది. అయితే ఈసారి ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చేయకపోవడంతో అభిమానుల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. అంతేకాక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ను అన్‌ఫాలో చేసిన విషయాన్ని కూడా అభిమానులు గమనించడం.. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా అనే ఊహాగానాలకు ఆజ్యం పెసినట్లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు