జైపూర్, క్రైమ్మిర్రర్: రాజస్థానలో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్ జూపూర్లోని చందవాణి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం గోడకూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న ఓ గోడ ఆకస్మత్తుగా కూలడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.కాగా కూలీలతో పాటు 12 మంది పైగా శితిలాల కింద చిక్కుకుపోయి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Also Read:రైల్లో చెత్త వేస్తూ 8 గంటలు హంగామా.. సహనం కోల్పోయిన ప్రయాణికుడు చెప్పిన షాకింగ్ స్టోరీ!
బేస్మెంట్లో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అధికారులు. శిథిలాల్లో చిక్కుకున్న మరి కొందరు కార్మికుల కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక జిల్లా కలెక్టర్ సందేశ్ నాయక్ సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read:ప్రాణం తీసిన ఫొటో సరదా – గోవా బీచ్లో రాకాసి అలలకు యువకుడు బలి, వైరల్ వీడియో