-
ఇచ్చిన మాటకు కట్టుబడి…ఒక్కొక్కటి నెరవేరుస్తున్న వైనం..
-
సొంత ఖర్చులతో ఊరి పోచమ్మ నిర్మాణం…
-
తాను సైతం పారపట్టి, మట్టితోడిన వైనం…
మంచిర్యాల, క్రైమ్మిర్రర్: స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎంతో కష్టపడి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఈ సర్పంచ్ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊరి అభివృద్దికి తాను కూడ పాలుపంచుకోవాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి, తాను గెలిచింది ఊరి కోసం, ఊరి భవిష్యత్ కోసం, ప్రజల శ్రేయస్సు కోసమని నిరుపిస్తున్నారు సర్పంచ్ దంపతులు. గత పాలనలో జరుగని అభివృద్ది నేడు చేసి చూపిస్తున్నారు. ఇప్పటికీ మీకు తెలిసే ఉంటుంది వారేవరో కాదు గొడిశెల పోసక్క-సంజీవ రెడ్డి దంపతులు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెరుస్తూ…
స్థానిక సంస్థల ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఊరిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని, నా ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చిన వారి వెంటే ఉంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా ఊరిలో ఉన్న పోచమ్మ అమ్మవారికి గుడి లేకపోవడంతో నన్ను గెలిపిస్తే పార్టీలకు అతీతంగా సొంత డబ్బులతో గుడి నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇచ్చిన మాట కోసం గెలిచిన రెండు మూడు నెలల్లోనే గుడి శంఖు స్థాపన చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ గురి నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకుంది.
పలువురికి ఆదర్శం…
పోచమ్మ గుడి నిర్మాణం చేపట్టిన నాటి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా గుడి నిర్మాణంలో పారపట్టి, మట్టితోడి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత పాలనలో ఏదైతే అభివృద్ది జరుగలేదో గెలిచిన ఏడాది లోపే ఈ సర్పంచ్ దంపతులు చేసి చూపిస్తున్నారు. ఇలాంటి నిస్వార్థమైనటువంటి గొడిశెల పోసక్క-సంజీవ రెడ్డి దంపతులు చేస్తున్న సేవాగుణంపై మండల, గ్రామ ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రామానికి ఇలాంటివి ఎన్నో అభివృద్ది పనులు మరెన్నో చేయాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
-
నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశం ఖం..!
-
ఏపీలో ఇక కాంగ్రెస్…!
-
తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!
