-
వ్యూహాత్మక మార్గాన్ని ఎంచుకున్న కల్వకుంట్ల కవిత
-
తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే అజెండాగా..
-
గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ లో కెసిఆర్ తనయ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అన్ని రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తోంది. గులాబీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇంకోవైపు బిజెపి సైతం బలమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో అందరి దృష్టి కల్వకుంట్ల కవిత పై ఉంది. కానీ ఆమె వ్యూహాత్మక మార్గం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఏసీ గదులకే పరిమితం కాకుండా.. ప్రకటనలు గుప్పించకుండా.. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయి సమస్యలు.. ముఖ్యంగా నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టులు, స్థానిక రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సమగ్ర అవగాహన పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాల వారీగా విస్తృతంగా పర్యటిస్తూ, ప్రాజెక్టుల వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ, పక్క గణాంకాలతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలపై తనకున్న సంపూర్ణ అవగాహనను ప్రజలకు వివరిస్తున్నారు కల్వకుంట్ల కవిత.
మీడియా ప్రచారం లేకపోయినా…
రాజకీయాల్లో ప్రధాన ప్రసార మాధ్యమాల్లో లభించే మైలేజ్ ఆధారంగానే నాయకులు ప్రాబల్యాన్ని అంచనా వేస్తుంటారు. అయితే కవిత విషయంలో ప్రధాన మీడియా పరిమిత ప్రచారం లభిస్తోంది. అయినా సరే గ్రామీణ ప్రాంతాలు, ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో మాత్రం స్పష్టమైన చర్చ నడుస్తోంది. టీవీ స్క్రీన్ లాక్ అంటే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య జరిగే ప్రత్యక్ష చర్చే ఏ రాజకీయ నాయకుడికైనా సుదీర్ఘకాలంలో అత్యంత బలమైన మైలేజ్ ను ఇస్తుందనేది ఒక పొలిటికల్ మంత్రం. కవిత చేపడుతున్న అధ్యయన పర్యటనలు, రైతులతో పాటు రైతు కూలీలతో చేస్తున్న ముఖాముఖిలు కింది స్థాయిలో ఓటర్లలో ఒక బలమైన భావనను కలిగిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కవిత పక్కా ప్రణాళికతో ఉన్నారు. పార్టీ పునాదులను బలపరుచుకునే ప్లాన్ కనిపిస్తోంది.
కిందిస్థాయి నుంచి పునాదులు…
ఒక ప్రాంతీయ ఉద్యమ నేపథ్యం నుండి వచ్చి.. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్న కవిత తన పార్టీ పునాదులను కిందిస్థాయి నుంచి నిర్మించుకుంటున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించడమే కాకుండా.. సామాజిక సమీకరణలను ప్రాధాన్యమిస్తూ.. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పోరాటమే అజెండాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వాల వైఫల్యాలను కేవలం విమర్శించడమే కాకుండా.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను కూడా ప్రజల ముందు ఉంచడం ద్వారా తన రాజకీయ పరిణితిని చాటుకుంటున్నారు.
ప్రచారం లేకుండా…
కవిత పార్టీ వ్యవహారాలను చూస్తే ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. హడావుడి ప్రచారం కంటే నిశ్శబ్దంగా క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించుకుంటూ ముందుకు వెళ్లడమే ఆమె వ్యూహంగా అర్థం అవుతుంది. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నీటి వివాదాలు, రైతు నష్టపరిహారాలు, స్థానిక సమస్యలపై స్పందిస్తూ కవిత చేస్తున్నాడు భవిష్యత్తు రాజకీయాల కోసం బలమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయని సూచిస్తున్నాయి. ప్రధాన మీడియా గుర్తింపుతో సంబంధం.. ప్రజా సమస్యల ఆధారంగా గ్రౌండ్ లెవెల్ లో నడుస్తున్న ఈ చర్చ రాబోయే రోజుల్లో కవితను ఒక బలమైన ప్రత్యామ్నాయ నాయకురాలుగా నిలబెట్టి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
