Homeతెలంగాణఅఖిల్‌కు కలిసొచ్చే 7 సెంటిమెంట్...లెనిన్ తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకుంటాడా...?

అఖిల్‌కు కలిసొచ్చే 7 సెంటిమెంట్…లెనిన్ తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకుంటాడా…?

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం లెనిన్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ ఏర్పడింది. ముఖ్యంగా టాలీవుడ్‌లో చర్చకు వస్తున్న 7వ సినిమా సెంటిమెంట్ ఇప్పుడు అఖిల్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ఇప్పటివరకు హీరోగా నటించిన సినిమాల్లో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్, ఈసారి లెనిన్ తో తప్పకుండా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మంచి విజయం సాధించినప్పటికీ, అది ఆయన కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పలేకపోయింది. అందుకే ఈ సినిమాపై అఖిల్‌తో పాటు అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.

Also Read:తాతగా మెప్పించిన సీఎం రేవంత్.. వంటగదిలో పూరీలు వేసిన వీడియో

టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలకు ఏడో సినిమా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఉదాహరణలు ఉన్నాయి. మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్‌కు ఖుషి, జూనియర్ ఎన్టీఆర్‌కు సింహాద్రి, రామ్ చరణ్‌కు ఎవడు, నాగ చైతన్యకు మనం, విజయ్ దేవరకొండకు గీత గోవిందం, నానికి పిల్ల జమిందార్, రామ్ పోతినేనికి కందిరీగ వంటి చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అఖిల్‌కు కూడా అదే సెంటిమెంట్ కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. హీరోగా చూస్తే లెనిన్ అఖిల్‌కు ఆరో చిత్రం. అయితే చిన్నప్పుడే ప్రధాన పాత్రలో నటించిన సిసింద్రీ ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇది ఆయన ఏడో సినిమా అవుతుంది. ఈ కారణంగానే 7వ సినిమా సెంటిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది కేవలం అభిమానుల నమ్మకం మాత్రమే. సినిమా విజయం ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది.

Also Read:రూ.4,000 కోట్ల ‘రామాయణం’ .. రూ.250 కోట్ల డీల్ !

లెనిన్ లో అఖిల్ తొలిసారి పూర్తి స్థాయి రూరల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం, మాస్ లుక్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. భాగ్యశ్రీ బోర్సేతో పాటు శివాజీ, ఈశ్వరీ రావు, రాంకీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ప్రవీణ్, రమేష్ ఇందిర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, లెనిన్ అఖిల్ కెరీర్‌కు కావాల్సిన తొలి భారీ విజయాన్ని అందిస్తుందా? టాలీవుడ్‌లో ‘7’ సెంటిమెంట్ మరోసారి నిజమవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం జూలై 10న ప్రేక్షకుల తీర్పుతో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు