క్రైమ్ మిర్రర్, సినిమా :- ‘కుబేర’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టారు.గత ఏడాది కాలంగా శ్రమించి ఆయన ఒక కొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా హీరో ఎంపిక పూర్తి కాలేదని తెలుస్తోంది. తన కథకు సరిపోయే కథానాయకుడి కోసం శేఖర్ కమ్ముల ప్రస్తుతం అన్వేషణలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే పలువురు హీరోలకు ఈ స్క్రిప్ట్‌ను వినిపించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఏషియన్ సునీల్ నిర్మించనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల-ఏషియన్ సునీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు బాటలో విజయ్.. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలపై నిషేధం!
రూ.200 కోట్ల ఇంట్లో ప్రభాస్ పెళ్లి..వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం…?
సమంతకు మరో బిగ్ ఓటీటీ ఆఫర్… టాక్ షో కోసం భారీ పారితోషికం…!