హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కారణంగా ఒక నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ఆర్టీ అద్దె బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఒక వ్యక్తిపై నుంచి బస్సును వెళ్లనిచ్చాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ పుటేజీలో నమోదైన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒడిశా ప్రాంతానికి చెందిన బులు సాహు (42) అనే వ్యక్తి బస్ స్టేషన్ నుంచి వెనుకవైపు ఉన్న సిటీ బస్ టెర్మినల్ వైపు వెళుతున్నారు.
Also Read:తెలంగాణలో కాసేపట్లో వర్షాలు: పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక!
అదే సమయంలో అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఒకటి అటుగా వచ్చింది. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పటికీ బస్సు డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వేగంగా వచ్చాడు. అదే సమయంలో బస్సు వస్తున్న మార్గం వైపు సాహూ కూడా వెళ్లాడు. అతడిని చూసుకోకుండా బస్సు డ్రైవర్ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బస్సు కింద పడి సాహూ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాలు తలపైకి వెళ్లడంతో సాహూ మృతి చెందాడు. ఈ ఘటన చూసిన చుట్టుపక్కల ప్రయాణీకులు బీతావహులయ్యారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పులి లక్ష్మీవరప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా, ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.
నిర్లక్ష్యంతో అనేక చోట్ల ప్రమాదాలు…
Also Read:ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా అనేక చోట్ల ప్రమాదాలు చోటుచూసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు డ్రైవింగ్ పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని, లేకపోతే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. తాజా ఘటనను పలువురు ఉదహరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఎంతో మంది దారుణమంటూ కామెంట్లు చేస్తున్నారు. అంత నిర్లక్ష్యంగా ఎలా డ్రైవింగ్ చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.