Homeతెలంగాణజాన్వీ కపూర్ మెహందీలో శిఖు పేరు.. సోదరి పెళ్లిలో ప్రియుడికి మరోసారి లవ్ హింట్...!

జాన్వీ కపూర్ మెహందీలో శిఖు పేరు.. సోదరి పెళ్లిలో ప్రియుడికి మరోసారి లవ్ హింట్…!

ముంబై, క్రైమ్‌మిర్ర‌ర్‌: జాన్వీ కపూర్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. బోనీ కపూర్ కుమార్తె, అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో జాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ కాంచీవరం చీరలో మెరిసిన ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆమె చేతిపై ఉన్న మెహందీ డిజైన్. అన్షులా కపూర్ రచయిత రోహన్ టక్కర్‌ను వివాహం చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొన్న జాన్వీ, ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె చేతిపై ఉన్న మెహందీలో ‘శిఖు’ అనే పేరు స్పష్టంగా కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read:ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

శిఖు అనేది జాన్వీతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న శిఖర్ పహారియా ముద్దుపేరు. గతంలో కూడా జాన్వీ పలు సందర్భాల్లో శిఖర్‌పై తన అభిమానాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. శిఖు పేరుతో నెక్లెస్ ధరించడం, శిఖర్ పేరు ఉన్న టీ-షర్ట్‌లు, నైట్ సూట్‌లతో కనిపించడం వంటి సంఘటనలు అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మెహందీలో కూడా అదే పేరు కనిపించడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ వర్గాల్లో జాన్వీ కపూర్, శిఖర్ పహారియా మధ్య ప్రేమ వ్యవహారం బహిరంగ రహస్యంగానే భావిస్తారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచే ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు చెబుతారు. 2016లో వీరి ప్రేమ గురించి మొదటిసారి వార్తలు వెలువడగా, కొంతకాలం దూరమైన తర్వాత 2023లో మళ్లీ కలిసి కనిపించడం ప్రారంభించారు. అప్పటి నుంచి కుటుంబ వేడుకలు, సినిమా ఈవెంట్లు, విహార యాత్రలు, ఆలయ దర్శనాలు వంటి అనేక సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు.

Also Read:రూ.4,000 కోట్ల ‘రామాయణం’ .. రూ.250 కోట్ల డీల్ !

ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా జంటగా దర్శించుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే తమ సంబంధంపై ఇప్పటివరకు జాన్వీ లేదా శిఖర్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ తరచూ కనిపిస్తున్న ఈ తరహా సంకేతాలు వారి బంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. సినిమాల విషయానికి వస్తే, జాన్వీ కపూర్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలపైనా దృష్టి పెడుతున్నారు. ఇటీవల తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వ్యక్తిగత జీవితం, సినిమాలు రెండింటి కారణంగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు