Homeఆంధ్ర ప్రదేశ్బీజేపీలోకి విజయసాయిరెడ్డి...!

బీజేపీలోకి విజయసాయిరెడ్డి…!

  • హిందుత్వవాదంతో గట్టి ప్రయత్నాలు

  • కాషాయ పెద్దల ప్రాపకం కోసం ఆరాటం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడాది కిందట గుడ్ బై చెప్పిన ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ ఆ పని చేయకుండా మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టారు. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతానని కూడా గతంలో తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.

అభ్యంతరాలతోని…

Also Read:Income Tax Job Scam: ఇన్‌కమ్ టాక్స్ ఆఫీస్‌లోనే నకిలీ ఇంటర్వ్యూలు.. లక్షలు దోచుకున్న కేటుగాళ్లు!

వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన నేరుగా బిజెపిలో చేరుతారని అంతా భావించారు. కానీ తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన నుంచి అభ్యంతరాలు రావడంతో కమలం పార్టీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఒకానొక దశలో సొంత పార్టీ పెడతారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ విషయాన్ని ఆయన కూడా ప్రకటించారు. అవసరం అనుకుంటే కొత్త పార్టీని పెడతానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆయన పార్టీకి ఏపీలో స్పేస్ లేదన్న విషయం ఆయనకి తెలుసు. అందుకే ఇప్పుడు బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మొన్ననే జార్ఖండ్లో బిజెపి మద్దతుతో గెలిచారు రాజ్యసభ సభ్యుడిగా పరిమల్ నత్వాని. అయితే ఆయన గెలుపు వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారన్న కామెంట్స్ వినిపించాయి. బిజెపికి దగ్గరవుతున్నారన్న టాక్ కూడా వచ్చింది.

సుదీర్ఘ పోస్టులతో…

Also Read:Kriti Sanon: కృతి సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే షాకింగ్ స్టెప్!

తాజాగా ఏపీలో హిందుత్వ వాదాన్ని వినిపించారు విజయసాయిరెడ్డి. జోసెఫ్ రావణ్ అరెస్ట్, నటుడు ప్రకాష్ రాజ్ సమర్ధన నేపథ్యంలో హిందూ ధర్మ రక్షణ, సనాతన సంప్రదాయాలంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టులు పెడుతూ విజయసాయిరెడ్డి బిజెపికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి చంత ఉంటూ.. ఇప్పుడు అకస్మాత్తుగా హిందుత్వ వాదాన్ని ఎత్తుకోవడం వెనుక ఉన్న కారణం బిజెపికి దగ్గర కావడమే అన్న అనుమానం ఉంది. ఢిల్లీలో కేసుల సెగలు.. ఏపీలో అధికారం పోయేక వస్తున్న అరెస్టుల భయంతోనే విజయసాయిరెడ్డి బిజెపి పెద్దల దృష్టిలో పడేందుకు ఇలా కాషాయ వేషాలు వేయడం ప్రారంభించారని పొలిటికల్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. విజయసాయిరెడ్డి చేస్తున్న ఈ అతి హిందుత్వ రాజకీయం అటు బిజెపికి నమ్మకం కలిగించడం లేదని తెలుస్తోంది. ఇప్పట్లో ఆయనకు బిజెపిలో అవకాశం చిక్కే ఛాన్స్ లేదని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు