HomeతెలంగాణTG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..

TG20కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 లీగ్’ ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి విజయ్‌ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.. తెలంగాణలో క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే విజన్‌లో దిగ్గజ సూపర్‌స్టార్ మాతో చేరినందుకు సంతోషిస్తున్నామమని.. ‘టీజీ20 లీగ్’ నిర్వాహకులు వెల్లడించారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహారిస్తున్న ఈ లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టు మిగతా అన్ని టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ తలపడతాయి.లీగ్‌లో మొత్తం 38 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. జూలై 12న ఉప్పల్ స్టేడియం వేదికగా ఫైనల్ ఫైట్ జరుగుతుంది. అయితే.. లీగ్ ప్రారంభానికి ముందు.. టీజీ20 (TG20) లీగ్ ట్రోఫీని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గర బుధవారం ఆవిష్కరించనున్నారు.

విజేతకు రూ.కోటి..రన్నరప్‌కు రూ.50 లక్షలు

లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు జులై 9న ఎలిమినేటర్ మ్యాచ్‌ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. జులై 9న రాత్రి జరిగే క్వాలిఫయర్‌-1లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఢీకొంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టు జులై 10న రెండో క్వాలిఫయర్‌లో ఎలిమినేటర్ విజేతతో తలపడనుంది. దీంట్లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. జులై 12న టైటిల్ పోరు ఉంటుంది. టీజీ20 లీగ్‌లో విజేతగా నిలిచే జట్టుకు కోటి రూపాయలు, రన్నరప్‌కు 50 లక్షల ప్రైజ్ మనీ అందుతుంది. టోర్నమెంట్‌లో విజేతకు అందించే విన్నర్స్ ట్రోఫీని ఇవాళ ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరిస్తారు. ఈ వేడుకకు హెచ్‌సీఏ ప్రతినిధులతో పాటు క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు