Homeఆంధ్ర ప్రదేశ్టిప్పర్‌ను ఢీకొన్న సుమో.. ముగ్గురు దుర్మరణం

టిప్పర్‌ను ఢీకొన్న సుమో.. ముగ్గురు దుర్మరణం

క్రైమ్ మిర్రర్ : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలంలోని టోల్‌గేట్ సమీపంలో టిప్పర్‌ను సుమో వాహనం ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. సిక్స్‌వే రహదారి నుంచి పాత సర్వీస్ సింగిల్ రోడ్డులోకి సుమో వాహనం ప్రవేశిస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సుమోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరుతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
also read : ట్రయల్ రూమ్‌లో యువతి దారుణ హత్య!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు