Homeక్రైమ్ప్రియుడి హత్యకు ప్రియురాలి స్కెచ్.. ఐదుగురు అరెస్ట్

ప్రియుడి హత్యకు ప్రియురాలి స్కెచ్.. ఐదుగురు అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : ప్రేమించిన ప్రియుడిని వదిలించుకోవడానికి ఓ యువతి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. స్నేహితుల సహాయంతో కిడ్నాప్ చేయించి, దాడికి పాల్పడిన ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పాలక్కాడ్ జిల్లా పట్టాంబికి చెందిన 19 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడితో పరిచయం పెంచుకుంది. అయితే కొద్దిరోజుల తర్వాత అతడిని దూరం పెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అతడిని అంతమొందించేందుకు తన మిత్రులకు బాధ్యతలు అప్పగించింది.

పథకం ప్రకారం నవంబర్ 10న రాత్రి ఆ యువకుడిని తిరూర్‌ ప్రాంతానికి పిలిపించారు. ముందుగా ఒకరు బైక్‌పై తీసుకెళ్లగా, మిగతా సభ్యులు అతడిని బలవంతంగా కారులోకి ఎక్కించి తీవ్రంగా కొట్టారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కుని, తీవ్ర గాయాలైన స్థితిలో తాళెపాలెం నదీ తీరం సమీపంలో పడేసి వెళ్లిపోయారు. దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, తాళెపాలెం పరిసర ప్రాంతాల్లో గాలించి బుధవారం తెల్లవారుజామున ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో యువతితో పాటు ఆమె మిత్రులైన ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. నిందితుల్లో ఇద్దరికి గతంలోనే మాదకద్రవ్యాల విక్రయాలు, హత్యాయత్నం వంటి క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరినీ స్థానిక కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
also read : టిప్పర్‌ను ఢీకొన్న సుమో.. ముగ్గురు దుర్మరణం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు