క్రైమ్ మిర్రర్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నడివాడ గ్రామానికి చెందిన సుష్మిత (24) ఆత్మహత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. డిగ్రీ పూర్తి చేసిన సుష్మిత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కుమారస్వామి, సుకన్య దంపతుల కుమార్తె అయిన ఆమెకు అదే గ్రామానికి చెందిన అనిల్‌తో రెండేళ్లుగా ప్రేమ సంబంధం ఉంది.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సుష్మిత పలుమార్లు అనిల్‌ను కోరినట్లు సమాచారం. అయితే కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు అంగీకరించరని చెబుతూ అనిల్ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మిత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సుష్మిత ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్‌తో పాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడు, అక్క, స్నేహితుడిని అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
also read : ప్రియుడి హత్యకు ప్రియురాలి స్కెచ్.. ఐదుగురు అరెస్ట్
