క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. ఇంకా కొంతమంది ఓటర్ల వివరాల నమోదు పెండింగ్‌లో ఉండటంతో గడువు పొడిగింపు అంశం తెరపైకి వచ్చింది.సబ్మిట్ చేయకపోతే ఓటు గల్లంతే..ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు విధిగా ఎన్యూమరేషన్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)ల ద్వారా భౌతికంగా కానీ, లేదా ఆన్‌లైన్ విధానంలో కానీ ఫామ్‌ను సబ్మిట్ చేయని పక్షంలో తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.98.32 శాతం డిజిటలైజేషన్ పూర్తి:ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం చురుగ్గా పని చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం (EC) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధికంగా 98.32 శాతం మంది ఓటర్ల వివరాలను విజయవంతంగా డిజిటలైజ్ చేశారు. మిగిలిన కొద్ది శాతాన్ని కూడా పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
10 రోజుల పొడిగింపునకు సీఈవో లేఖ:- ఇంకా నమోదు చేసుకోని ఓటర్లకు అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించాలని వివిధ రాజకీయ పార్టీలు, జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, కలెక్టర్ల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో).. ఈ ఎన్యూమరేషన్ గడువును మరో 10 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు.దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? గడువును పొడిగిస్తూ అధికారిక నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవాలని, పెండింగ్‌లో ఉన్నవారు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
భారత్ vs ఇంగ్లాండ్ తొలి వన్డే.. నేటి నుంచే వన్డే సిరీస్ సమరం!