క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ‘ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్’గా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఇమిగ్రేషన్, విదేశీయుల నమోదు చట్టం నిబంధనల పరిధిలోకి ఈ విమానాశ్రయాన్ని చేరుస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దేశంలోని కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో భోగాపురానికి 39వ స్థానం కల్పించారు. ఈ గుర్తింపుతో భోగాపురం నుంచి నేరుగా విదేశాలకు విమాన రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇకపై విదేశీ ప్రయాణికులు ఇక్కడి నుంచే తమ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ పూర్తి చేసుకోవచ్చు.
టాలీవుడ్‌లో మరోసారి ‘భగవంత్ కేసరి’ మ్యాజిక్!
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం..ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చబోతోందని నిపుణులు భావిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్ర ప్రయాణికులకు కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఉపాధి, ఉన్నత విద్య మరియు వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు ఇకపై హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా భోగాపురం నుంచే తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.జిఎంఆర్ (GMR) గ్రూప్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే.. ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగం మరింత ఊపందుకుంటాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఉన్న ఐటీ, ఫార్మా రంగాలకు మరియు సీ ఫుడ్ ఎగుమతులకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో కీలకం కానుంది. త్వరలోనే ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేసి, పూర్తి స్థాయిలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నేటితో ముగియనున్న SIR గడువు.. పొడిగింపు కోరుతూ ఈసీకి సీఈవో లేఖ!