Homeసినిమారూ. 100 కోట్ల క్లబ్‌లో అదరగొడుతున్న హీరోయిన్లు.. బాక్సాఫీస్ వద్ద లేడీ ఓరియెంటెడ్ సినిమాల హవా!

రూ. 100 కోట్ల క్లబ్‌లో అదరగొడుతున్న హీరోయిన్లు.. బాక్సాఫీస్ వద్ద లేడీ ఓరియెంటెడ్ సినిమాల హవా!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే వందల కోట్లు వసూలు చేసేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథలో దమ్ముంటే, నటనలో సత్తా ఉంటే.. తమ భుజాలపై సినిమాను మోస్తూ హీరోయిన్లు సైతం వందల కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతున్న హీరోయిన్ల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు అగ్రకథానాయికలు ఈ ఘనత సాధించారు.టాలీవుడ్‌లో సమంత మార్క్..ఇటీవల తెలుగులో విడుదలైన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’తో స్టార్ హీరోయిన్ సమంత ఏకంగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి స్టార్ హీరోల అండ లేకుండా, కేవలం తన అద్భుతమైన నటనతో ఆమె ఈ ఫీట్ సాధించడం విశేషం.బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న భామలు..ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ వంద కోట్ల మార్క్ దాటేసిన మహిళా ప్రధాన చిత్రాలు అనేకం ఉన్నాయి. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ ఏకంగా రూ. 250 కోట్లు రాబట్టగా, ఆమె నటించిన మరో చారిత్రక చిత్రం ‘మణికర్ణిక’ రూ. 140 కోట్లు వసూలు చేసింది. ఇక టాలెంటెడ్ బ్యూటీ అలియా భట్ నటించిన స్పై థ్రిల్లర్ ‘రాజీ’ రూ. 192 కోట్లు వసూలు చేయగా, ‘గంగూబాయి’ ఏకంగా రూ. 200 కోట్ల కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది.’స్త్రీ 2′ తో సంచలనం సృష్టించిన శ్రద్ధా కపూర్..హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన శ్రద్ధా కపూర్ ‘స్త్రీ’ సినిమాతో రూ. 180 కోట్లు రాబట్టింది. అయితే ఇటీవల వచ్చిన దానికి సీక్వెల్ ‘స్త్రీ-2’ ఏకంగా రూ. 850 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మరోవైపు మలయాళ భామ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లోకా-1’ సైతం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ గణాంకాలు చూస్తుంటే.. కంటెంట్ బలంగా ఉంటే హీరోయిన్ల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయని స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని మహిళా ప్రధాన చిత్రాలు ఈ జాబితాలో చేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

పోల‌వ‌రం వివాదం…సుప్రీం కోర్టులో తెలంగాణకు షాక్…!

నేటితో ముగియనున్న SIR గడువు.. పొడిగింపు కోరుతూ ఈసీకి సీఈవో లేఖ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు