న్యూఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌లో లోపాలున్నాయంటూ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వానికి తక్షణ నోటీసులు, ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గోదావరి నీటి వినియోగం, పోలవరం-బనకచర్ల అనుసంధానం వంటి అత్యంత కీలకమైన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ వివాదాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also Read:హార్ముజ్‌ను నడిపిస్తాం.. 20% ఫీజు చెల్లించాలి: ట్రంప్
ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, ప్రాజెక్టుల లింకేజీలపై నెలకొన్న వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే ఏపీ ప్రభుత్వానికి తక్షణమే నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. తెలంగాణ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఈ సందర్భంగా ఎత్తిచూపింది. ఆ లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.
Also Read:భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్రం కీలక గుర్తింపు.. ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా ప్రకటన!