క్రైమ్ మిర్రర్, టాలీవుడ్:- ఆరు దశాబ్దాల పాటు తన మధురమైన స్వరంతో కోట్ల మంది శ్రోతలను ఓలలాడించిన భారతీయ చిత్ర పరిశ్రమ అగ్రగామి గాయని ఎస్. జానకి గారి ఆస్తులపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు మరియు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సంపాదించిన ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎస్. జానకి గారి మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 537 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు మైసూర్ వంటి ప్రాంతాలలో ఆమెకు విలాసవంతమైన ఇళ్లు మరియు స్థిరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం గానం ద్వారానే కాకుండా, గతంలో ఆమె చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఇప్పుడు భారీగా పెరిగి ఆమె నికర ఆస్తి విలువను పెంచాయని సమాచారం. దక్షిణాది కోకిలగా గుర్తింపు పొందిన ఎస్. జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భారతీయ భాషల్లో దాదాపు 50,000 పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. దశాబ్దాల పాటు దేశవిదేశాల్లో నిర్వహించిన వేలాది స్టేజ్ షోలు, మ్యూజికల్ కచేరీల ద్వారా ఆమె భారీగా ప్రజాదరణతో పాటు అపారమైన కీర్తిని, సంపదను ఆర్జించారు.వయోభారం కారణంగా ఎస్. జానకి గారు 2017 లోనే తన సుదీర్ఘ సంగీత ప్రస్థానానికి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె మైసూర్‌లో నివాసం ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
బయటపడిన మావోయిస్టుల భారీ డంప్.. భారీగా ఆయుధాలు, నగదు, బంగారం స్వాధీనం