Homeక్రైమ్బస్సులో ప్యాంట్ జిప్ విప్పి అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన యువతి

బస్సులో ప్యాంట్ జిప్ విప్పి అసభ్య ప్రవర్తన.. చెంప పగలగొట్టిన యువతి

మధ్యప్రదేశ్‌లో ఓ యువతి ధైర్యంగా వ్యవహరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బస్సులో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ఆమె తగిన గుణపాఠం చెప్పింది. సాగర్ జిల్లా డియోరీ కలాన్ బస్టాండ్‌లో ఓ యువకుడు బస్సు ఎక్కాడు. బస్సులో ఉన్న కొందరు యువతుల వద్దకు వెళ్లిన అతడు ప్యాంట్ జిప్ తీస్తూ  అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. అతడి ప్రవర్తనను గమనించిన ఓ యువతి వెంటనే స్పందించి, అతడిని నిలదీసింది. అనంతరం అతడిపై చేయి చేసుకుని తీవ్రంగా హెచ్చరించింది.

also read: పుట్టినరోజు రోజే విషాదం.. నడిరోడ్డుపై భార్యను కాల్చిచంపిన కానిస్టేబుల్!

ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా రవాణా ప్రదేశాల్లో మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారితీసిన ఈ ఘటనలో.. యువతి ధైర్యంగా స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

also read: మహేష్ బాబు ఇంట్లో పెళ్లి సందడి.. కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేయనున్నసూపర్ స్టార్ మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు