Homeక్రైమ్పుట్టినరోజు రోజే విషాదం.. నడిరోడ్డుపై భార్యను కాల్చిచంపిన కానిస్టేబుల్!

పుట్టినరోజు రోజే విషాదం.. నడిరోడ్డుపై భార్యను కాల్చిచంపిన కానిస్టేబుల్!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ తన భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటన కల్యాణ్‌పురి ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. మనీశ్‌ భాటి, అతని భార్య ప్రియాంక సోమవారం తెల్లవారుజామున స్కూటర్‌పై వెళ్తుండగా ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో భాటి స్కూటర్‌ను ఆపి, తన వద్ద ఉన్న ఆయుధంతో భార్యపై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

also read: షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక మలుపు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రియాంక రోడ్డుపై పడిపోగా, స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ వివాదమే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరో విషాదకర విషయం ఏమిటంటే.. ఘటన జరిగిన రోజే ప్రియాంక పుట్టినరోజు కావడం స్థానికులను కలచివేసింది.

also read: ఇన్‌స్టాగ్రామ్ ప్రియురాలితో హోటల్‌లో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!

తాజావార్తలు